- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ పోటుగాళ్లతో తెలంగాణ రాలే : బండి
దిశ, సూర్యాపేట : టీఆర్ఎస్ పోటుగాళ్లతో తెలంగాణ రాలేదని, 1500 మంది అమరుల త్యాగం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమాలు చేసింది బీజేపీనేనని, కేంద్రంలో బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకోవాలని సూచించారు. ప్రజాసంక్షేమ పథకాలలో కేంద్రం వాటాను తమ వాటాగా చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రభుత్వం తరపున ఎన్ని నిధులు విడుదల చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను రూ.రెండు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో రెండు, మూడు కార్పొరేట్ కాలేజీలకు సీఎం దాసోహం అయ్యాడని ఆరోపించారు. జీతాలు లేక ప్రైవేట్ ఉపాధ్యాయులు కూలి పని చేసుకుంటుంటే వారి కోసం సీఎం ఒక్క పథకానైనా ప్రవేశపెట్టారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. సూర్యాపేటలో కలెక్టరేట్ నిర్మాణం భూ బకాసురుల కోసమే మార్చారని ఆరోపించారు.
బైంసాలో ఇంత జరుగుతున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేంధర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెరాస అభ్యర్థి ‘పల్లా’ కాదు ‘గళ్ల’ రాజేశ్వర్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.