సీఎం అభ్యర్థిగా మెట్రోమ్యాన్.. ప్రకటించిన కేరళ బీజేపీ చీఫ్

by Shamantha N |   ( Updated:2021-03-04 06:08:02.0  )
metroman sreedharan
X

దిశ, వెబ్ డెస్క్: కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. రెండు వారాల క్రితమే ఆయన బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. శ్రీధరనే తమ పార్టీ అభ్యర్థి అని కేరళ బీజేపీ చీఫ్ కె. సురేంద్రన్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విజయ్ యాత్రలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే మిగిలిన అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు.

ఇక గతవారం శ్రీధరన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచైనా తాను పోటీ చేస్తాననీ, ఎక్కడి నుంచి పోటీ చేసినా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే తాను నివసిస్తున్న మలప్పురం లోని పొన్నానికి దగ్గరగా ఉండే నియోజకవర్గమైతే సౌకర్యంగా ఉంటుందని ఆయన చెప్పారు. కేరళలో ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది.

Advertisement

Next Story

Most Viewed