తిరుపతిలో కలిసి పోటీ చేస్తాం: సోము వీర్రాజు

by srinivas |
Somu Veerraju
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను శుక్రవారం ఆయన కలిశారు. మీడియాతో సోము వీర్రాజు శనివారం మాట్లాడుతూ… రామతీర్థంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయాలపై దాడులు రాజకీయ అంశం కాదన్నారు. ఆత్మాభిమానం, స్వాభిమానానికి సంబంధించిన అంశమని చెప్పారు. దుబ్బాక విజయం బీజేపీలో ఎంతో ఉత్సాహం నింపినట్లు తెలిపారు. ఇదే దూకుడుతో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు సమాయత్తమవుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed