- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్ డమాల్
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా కారణంగా ఆకాశన్నంటిన చికెన్‌ధరలు నేడు బర్డ్‌ఫ్లూ వైరస్ప్రచారంతో నేలచూపులు చూస్తున్నాయి. రోజురోజుకూ పడిపోతున్న ధరలు పౌల్టీరంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళలో బర్డ్ ఫ్లూ ప్రభావం తీవ్రంగా ఉండడంతో చికెన్తినేందుకు నగరవాసులు ఆసక్తి కనబరచడం లేదు. డిసెంబర్లో కిలో చికెన్రూ.250 పలుకగా నేడు రూ.150కి చేరుకుంది. కోడి గుడ్ల ధరలు సైతం అదేబాటలో పయనిస్తున్నాయి. భాగ్యనరంలో సాధారణ రోజుల్లో లక్ష కిలోల చికెన్అమ్మకాలు జరుగుతుండగా ప్రస్తుతం సగానికి పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో వైపు బాగా ఉడికించిన చికెన్ తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
బర్డ్ ఫ్లూ భయంతో హైదరాబాద్ నగరంలో చికెన్ అమ్మకాలు అమాంతం పడిపోయా యి. సాధారణంగా చలి కాలంలో చికెన్ అమ్మకాలు అధికంగా ఉంటాయి. అయితే, ఇటీవల కాలంలో రాజ స్తాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళలో బర్డ్ ఫ్లూ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేప థ్యంలో గత వారం వరకు ఓ మోస్తరుగా ఉన్న చికెన్ అమ్మ కాలు నేడు సగానికి పడిపోయాయి. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు లేకున్నా ప్రజలు చికెన్ తినడానికి ముందుకు రావడం లేదు.
డిసెంబర్ తో పోలిస్తే చికెన్ ధరలతో పాటు అమ్మకాలు కూడా భారీగా తగ్గాయి. బర్డ్ ఫ్లూ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దీని ప్రభావం పౌల్ట్రీ రంగంపై పడుతోంది. డిసెంబర్ చివరి వరకు కిలో రూ.250 పలికిన చికెన్ ధర ప్రస్తుతం రూ.150కి చేరుకుంది. రోజు రోజుకూ ధరలు తగ్గిపోతున్నాయి. రానున్న రోజు ల్లో మరింతగా ధరలు పడిపోయే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. చికెన్‌తో పాటు కోడి గుడ్ల ధరలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. చికెన్ బాగా ఉండికించి తినడంతో ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యు నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ లోనే అధికంగా..
సాధారణ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. ఇందులో సుమారు 30 నుంచి 40 శాతం చికెన్ అమ్మకాలు హైదరాబాద్ నగరంలోనే జరుగుతాయి. ప్రతీ నిత్యం హైదరాబాద్ నగరంలో సుమారు లక్ష కిలోలకు పైగా ఇటీవల వరకు చికెన్ అమ్మకాలు జరిగేవి. గత పది రోజులుగా బర్డ్ ఫ్లూ భయంతో వీటి అమ్మకాలు సగానికిపైగా పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.
బర్డ్ ఫ్లూ అంటే…
ఏవియన్ ఇంఫ్లుయెంజా అని పిలవబడే బర్డ్ ఫ్లూ కేవలం పక్షులనే కాదు, జంతువులు, మానవులపై కూడా ప్రభా వం చూపగలదు. ఈ వైరస్ యొక్క చాలా ఫార్మ్స్ పక్షులకే పరిమితం. బర్డ్ ఫ్లూ లో హెచ్5 ఎన్1 అనేది చాలా కామ న్. ఇది పక్షులకి ప్రాణాంతకమైంది. ఈ వైరస్ ను క్యారీ చేసే వాటితో జంతువులకు, మనుషులకు కూ డా చాలా త్వరగా సోకుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం హెచ్5 ఎన్1 మొద టగా 1997లో మనుషుల్లో గుర్తించారు. ఇది సోకిన వారిలో సుమా రుగా 60శాతం మంది మరణించా రు. ప్రస్తుతం హెచ్5 ఎన్1 మనిషి నుంచి మనిషి కి సోకడం లేదు.
సగానికి పడిపోయాయి…
బర్డ్ ఫ్లూ ప్రచారంతో ప్రజలు చికెన్ తినేందుకు ముందుకు రావడం లేదు. దీంతో రోజురోజుకూ అమ్మకాలు పడిపోతున్నాయి. ధరలు కూడా తగ్గుతున్నాయి. 2020లో కరోనా కార ణం గా వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. కొత్త సంవత్సరం ఇలా మొదలైందో లేదో అలా బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. –అంజి, చికెన్ వ్యాపారి, దిల్సుఖ్నగర్