సీఎం కీలక ప్రకటన.. ఈనెల 25 వరకు లాక్‌డౌన్ పొడగింపు

by Shamantha N |   ( Updated:2021-05-13 04:17:07.0  )
సీఎం కీలక ప్రకటన.. ఈనెల 25 వరకు లాక్‌డౌన్ పొడగింపు
X

దిశ, వెబ్‌డెస్క్ : బీహార్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడి కోసం బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ నెల 15వ తేదీ వరకూ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికీ కరోనా కేసులు తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను ఈనెల 25వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.

Advertisement

Next Story