- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss-8: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న బుల్లితెర స్టార్ నటి..!
దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మొదలై వారం పూర్తి కావొస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ రోజు నుంచే ఆట మొదలెట్టి గొడవలు పడుతున్నారు. ఈ సారి లిమిట్‌లెస్ అని నాగార్జున చెప్పినట్టుగానే రోజు ట్విస్టులు ఇస్తూ ఆసక్తికరంగా మారింది. అయితే వారం పూర్తి కావస్తుండటంతో ఒకరు ఎలిమినేట్ అయి బయటకు వెళ్లబోతున్నారు. దీంతో బిగ్‌బాస్ మేకర్స్ వైల్డ్ కార్డు ఎంట్రీలను రెడీ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బుల్లితెర స్టార్ నటి జ్యోతి రాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ స్టార్టింగ్ లోనే బిగ్‌బాస్ టీమ్ ఆమెను సంప్రదించారని కానీ షూటింగ్స్ వల్ల వేల్లలేకపోతున్నానని తెలిపిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆమెకు వాళ్ళు వైల్డ్ కార్డు ఎంట్రీకి చాన్స్ ఇచ్చినట్లు టాక్. అయితే ఇప్పుడు జ్యోతిరాయ్ హౌస్‌లోకి వెళ్లబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతుండటంతో ఆమె ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. కాగా, జ్యోతి రాయ్ బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇందులో సంప్రదాయ లుక్‌లో కనిపించి అందరికీ మంత్రముగ్దులను చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. తన హాట్ పిక్స్ షేర్ చేసి అందరి దృష్టి తన వైపుకు తిప్పుకుంటోంది. ఇక జ్యోతిరాయ్ ఓ యంగ్ డైరెక్టర్‌ను రెండో పెళ్లి చేసుకొని జీవనం కొనసాగిస్తోంది. అలాగే పలు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటుంది.