Bigg Boss season-8: బిగ్‌బాస్ వీకెండ్‌లో నాగ్ ధరించిన సింపుల్ షర్ట్స్ ధర తెలిస్తే ఖంగుతినాల్సిందే!!

by Anjali |   ( Updated:2024-09-24 15:42:26.0  )
Bigg Boss season-8: బిగ్‌బాస్ వీకెండ్‌లో నాగ్ ధరించిన సింపుల్ షర్ట్స్ ధర తెలిస్తే ఖంగుతినాల్సిందే!!
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 హోరాహోరిగా సాగుతోంది. సక్సెస్‌ఫుల్‌గా మూడు వారాలు పూర్తి చేసుకుంది. హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టగా.. ఫస్ట్ వీక్‌లో బెజవాడ బేబక్క, సెకండ్ వీక్ లో శేఖర్ బాషా, మూడో వారంలో అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. ప్రజెంట్ నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్లు జరుగుతున్నాయి. ఇకపోతే నాగార్జున శనివారం, ఆదివారం స్టేజ్‌పైకొచ్చి.. హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతారన్న విషయం తెలిసిందే. కంటెస్టెంట్ల తప్పులు చెబుతారు. క్లాస్ పీకుతాడు. టాస్కులు మంచిగా ఆడినవారిని పొగుడుతాడు.

అయితే నాగార్జున ప్రతి వీకెండ్‌లో వెరైటీ కాస్ట్యూమ్స్ ధరిస్తారు. వాచ్, షర్ట్, గ్లాసెస్ ఇలా ఇవి తెలుగు ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకుంటాయి. నాగార్జున హోస్టింగ్ చేస్తుంటే అందరి దృష్టి వాటిపైకే మళ్లుతుంది. ఈ క్రమంలో నాగార్జున గత వారం ధరించిన షర్ట్, గాడ్జెట్స్ ధర ఎంతని సెర్చ్ చేయడం ప్రారంభించారు. తాజాగా లీక్ అయిన వివరాలు చూసినట్లైతే..

కామన్‌గా ఎవరైనా ఏవైనా ఫంక్షన్స్, ఈవెంట్స్ ఉంటే.. వేయి, రెండు వేల షర్ట్ ధరిస్తారు. కానీ నాగార్జున వేసుకున్న ఈ షర్ట్ ధర ఏకంగా 15 వేల రూపాయలు. ఈ కాస్ట్ విన్న జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఈ శనివారం నాగార్జున వేసుకున్న డార్క్ బ్లూ, పైన డార్క్ గ్రీన్‌ వచ్చిన షర్ట్ కు కూడా 15 వేల రూపాయలే. ఆయన పెట్టుకున్న గ్లాసెస్ కు ఏకంగా రూ. 82 వేలు అని టాక్. కాగా ఈ మనీతో మధ్యతరగతి కుటుంబం వారు కనీసం ఓ ఐదారు నెలలు అయినా బతికేయోచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More...

Special Story : టాలీవుడ్‌లో నయా ట్రెండ్.. థియేటర్లలో కేక పుట్టిస్తున్న పాత సినిమాలు

Advertisement

Next Story