బిగ్ బాస్ హౌస్ లోకి పీరియడ్స్ పాడ్స్‌తో టాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ..!

by Hamsa |   ( Updated:2023-11-06 05:43:40.0  )
బిగ్ బాస్ హౌస్ లోకి పీరియడ్స్ పాడ్స్‌తో టాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ షో తొమ్మిదో వారం చివరకు వచ్చేసింది. ఇప్పటికే ఎనిమిది మంది ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. దీంతో రోజు రోజుకు ఈ షో చాలా రసవత్తరంగా మారుతుంది. ఒక బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు వెరైటీ టాస్కులు పెట్టి వారిలోని టాలెంట్‌ను బయటకు తీస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ వారం ఎపిసోడ్ వీకెండ్‌కు చేరుకుంది. ఇందులో భాగంగా సండే ఫన్ డే గా నాగార్జున మార్చేశారు. తర్వాత ఈ షోకు టాలీవుడ్ హీరోయిన్ ఈషారెబ్బా గెస్ట్‌గా వచ్చింది. నాగార్జున అచ్చ తెలుగు అమ్మాయి అంటూ అందరికీ చెప్పాడు. అలాగే ఆమె దేని గురించే మాట్లాడటానికి వచ్చిందో కూడా వివరించారు. ఆ తర్వాత ఈషా మాట్లాడుతూ.. నేను చాలా ఎక్జైటింగ్‌గా ఉన్నాను. ఎందుకంటే నేను సానిటరీ పాడ్స్, పలు ప్రోడక్ట్స్ గురించి చాలా వరకు ఎవైర్‌నెస్ లేదు కాబట్టి నేను దాని గురించి చెప్పడానికి వచ్చాను.

చాలా రూరల్ ఏరియాస్‌లో పీరియడ్స్ రాగానే స్కూల్‌కు కూడా వెళ్లనివ్వరు దాని గురించి అందరికీ వివరించాలని వచ్చా అని చెప్పింది. దీనికి నాగార్జున ఆమెను మెచ్చుకుని ఇంట్లోకి పంపుతాడు. తర్వాత ఈషా ఇంట్లోకి వెళ్లి.. కంటెస్టెంట్స్ అందరినీ ఒక దగ్గరకు చేర్చి మాట్లాడుతుంది. ‘‘ నేను ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పడానికి వచ్చాను. దాని గురించి ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అని అంటుంది. ఒక నెలలో ఒక అమ్మాయికి ఎన్ని రోజులు పీరియడ్స్ ఉంటాయని అడుగుతుంది.. దానికి అబ్బాయిలు 4, 5 రోజులు అని సమాధానమిస్తారు. దానికి సరే అంటుంది. తర్వాత కొందరికి ఈ విషయం తెలియదు అందుకే అడిగాను ఇప్పుడు అందరూ తెలుసుకుంటారు.

ఇక వెంటనే సాధారణంగా మెన్సెస్ ఎంత ఏజ్‌లో మొదలవుతాయని ప్రశ్నిస్తుంది.. రతిక 12, 13 సంవత్సరాలకు అని చెప్తుంది. భారతదేశంలో ఎంత మంది పాడ్స్ వినియోగిస్తున్నారని అడిగితే.. రూరల్స్‌లో తెలియదు.. క్లాత్స్ వాడుతుంటారు. ఊర్లతో తెలియక అలా చేస్తారు.. నేను చాలా క్యాంపైన్స్ నిర్వహించాను. అలా చేయడం వల్ల అందరికీ అర్థమయ్యేలా చెప్పొచ్చు అని చెప్పుకొచ్చింది ఈషా. అలాగే మనకు పాడ్స్ లభించకపోయి ఉంటే ఇక్కడ మనం ఉండేవాళ్లం కాదని పూర్తి అవగాహన కల్పించడంతో పాటు తనకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంది. దీంతో ఇది చూసిన నెటిజన్లు ఈషా రెబ్బా షోకు వచ్చి మరీ అందరి ముందు చెప్పడం చాలా గ్రేట్ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed