రతిక మా వాడిని వాడుకుంది.. పెళ్లి చేసేస్తాం పల్లవి ప్రశాంత్ తల్లి షాకింగ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-09-16 04:23:24.0  )
రతిక మా వాడిని వాడుకుంది.. పెళ్లి చేసేస్తాం పల్లవి ప్రశాంత్ తల్లి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ షో ‘బిగ్‌బాస్-7’ షోకి వెళ్లి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు. తన మాట తీరు, ఆటతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. తాజాగా, ప్రశాంత్ తల్లదండ్రులు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడి తల్లి మాట్లాడుతూ ‘‘ నా కొడుకు బిగ్‌బాస్ షోకి వెళ్లినందుకు సంతోషంగా ఉంది. కానీ, అమర్ దీప్ నా కొడుకును ఏందిరా అన్నందుకు బాధేసింది. నా కొడుకును రైతు అని హేళన చేస్తున్నారు. నాకు అదుంది, ఇదుందని విర్రవీగొద్దు. హౌస్‌లో అందరూ సమానమే.

నా కొడుకు ఒకసారి లవ్ సాంగ్ తీస్తే రూ. 7 లక్షలు వచ్చాయి. ఆ డబ్బులను నా కొడుకు స్నేహితులు తీసుకుని మోసం చేశారు. అప్పుడు నా కొడుకు చాలా ఏడ్చాడు. ఒకరోజైతే చస్తానని పొలం దగ్గరకు వెళ్లిండు. నీకే కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పిన. అప్పుడు ఫోన్ కొనిస్తే రీల్స్ చేసుకుంటానన్నాడు. ఫోన్ కొనిచ్చిన, రీల్స్ చేసుకుంటూ ఫేమస్ అయ్యాడు. కానీ ఏదో ఒకటి చేయాలని తిండి తిప్పలు లేకుండా తిరిగిండు. బిగ్‌బాస్ వెళ్లిండు. నాగార్జున సార్‌ను కలిశాడు మాకు అదే సంతోషం. ప్రశాంత్‌కు పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ తనకు ముందు సెటిలవ్వాలని ఉంది. సెటిలైన తర్వాతే పెళ్లి చేసుకుంటా అని మళ్లీ ఆ ప్రస్తావన తెస్తే ఇంట్లోకి రానని అన్నాడు. అందుకే ఊరుకున్నాం. బిగ్‌బాస్ నుంచి వచ్చాక పెళ్లి చేసేస్తాం. రతిక మా కొడుకుని వాడుకుంది. ప్రశాంత్‌తో ఉంటే అతడికొచ్చే ఓట్లు తనకు కూడా వస్తాయని అనుకుని వాడుకుంది అంతే. ప్రశాంత్ అందరినీ అక్కాచెల్లె అనుకుంటూనే మాట్లాడుతాడు. తను ఎటువంటి దురాలోచన చేయడు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed