- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దయచేసి అలా చీప్‌గా మాట్లాడకండి ప్లీజ్.. వీడియో విడుదల చేసిన బుల్లితెర జంట
దిశ, సినిమా: తెలుగు రియాలిటీ సెప్టెంబర్ 1 నుండి సీజన్-8 ప్రారంభం కాబోతుంది. సీజన్-8 కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. షోలో పాల్గొన్న బోతున్న వారి పేర్లు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్‌బాస్ సీజన్-8లో హీరో ఆదిత్యం ఓం, సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్, కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో విలన్‌గా చేసిన యష్మీ గౌడ, కొన్ని సినిమాల్లో హీరోగా చేసిన అభిరామ్ వర్మ, యూట్యూబర్ బెజవాడ బేబక్క, ఢీ డ్యాన్సర్ నైనిక అనసూరు, అభయ్ నవీన్, బేబీ మూవీ నటి కిర్రాక్ సీత, హీరోయిన్ విస్మయ శ్రీ, యాంకర్ విష్ణుప్రియ, సీరియల్ నటుడు ఇంద్రనీల్ వెల్లబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇంద్రనీల్ భార్య ఒప్పుకోకపోవడం వల్ల ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా, ఇంద్రనీల్ కామెంట్స్ చేసిన ఓ వీడియో రిలీజ్ చేశాడు. ‘‘ బిగ్‌బాస్ టీమ్ నన్ను సంప్రదించిన మాట నిజమే కానీ కానీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. నాలాంటి వాళ్లకి అలాంటివి సెట్ కావు అందులోకి పోతే నామినేషన్స్, గొడవల వల్ల నెగిటివిటీ వస్తుంది. అందుకే వెళ్లాలనుకోవట్లేను. అయితే కొంతమంది నా భార్య వల్ల నేను ఆఫర్ రిజెక్ట్ చేశానని చాలామంది దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. నా భార్య ఎప్పుడూ అలాంటి విషయాల్లో జోక్యం చేసుకోదు. ఆ నిర్ణయం నాదే. ఒక మహిళ అయితే మరీ దారుణంగా అందులోకి వెళ్లి పచ్చళ్ల బిజినెస్ పెరుగుతుందని అని మాట్లాడుతుంది.
అసలు మా జీవితంలోకి మీరు దూరొద్దు. మీకు మీరే ఏవేవో ఊహించుకుని ఏది పడితే అది మాట్లాడకండి. అలాంటి కామెంట్లు చేయడం వల్ల మేము సంపాదించుకున్న పేరును మీరు తెచ్చుకోలేరు. కొందరు బిగ్‌బాస్ న్యూస్‌లు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఒకరి జీవితంలోకి వెళ్లి బెడ్రూమ్‌లోకి పోయి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నారు. మేము కూడా మనుషులమే కాబట్టి మీ ఎమోషన్స్‌ను మా మీద రుద్దకండి. మా కూడా ఫ్యామిలీ, తల్లిదండ్రులు ఉంటారు. దయచేసి మీరు ఒకటి తెలుసుకోండి. మా ఆయన కొంగుచాటు మెగుడు కాదండీ ప్లీజ్ అలా అనకండి చీప్‌గా మాట్లాడకండి అని మేఘన చెప్పుకొచ్చింది. అలాగే ఇంద్రనీల్ ఆఫర్ వచ్చింది కానీ నేనే వదులుకున్నా. నా వెళ్లాలని అనిపిచ్చినప్పుడు వెళ్తాను. అది వచ్చే ఏడాది అయినా కావొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం వెళ్లట్లే అని క్లారిటీ ఇచ్చాడు.