- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బాస్ సీజన్ 8కి నందమూరి నట సింహం హోస్టింగ్..!
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆధారణ పొందిన షోలలో ‘బిగ్ బాస్’ రియాల్టీ షో ఒకటి. 2017 జూలై 16న స్టార్ట్ అయిన ‘బిగ్ బాస్ (తెలుగు సీజన్ 1)’కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. సెకండ్ సీజన్ నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయగా.. మూడో సీజన్‌ను నుంచి తాజాగా ప్రసారం అవుతున్న బిగ్ బాస్-7 సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇక రాబోయో బిగ్ బాస్-8 సీజన్‌కు మాత్రం నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
నిజానికి బిగ్ బాస్-7 కి కూడా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి, కానీ, చివరికి నాగార్జునే ఫైనల్ అయ్యారు. ఇక నెక్ట్స్ వచ్చే సీజన్‌కు మాత్రం బాలకృష్ణ హోస్టింగ్ అంటూ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ఆయనే కనుక హోస్ట్ చేస్తే.. బాలయ్య టైమింగ్‌కు, ఆయన కోపానికి బిగ్ బాస్ షో వేరే లెవల్‌లో ఉంటుందంటున్నారు నెటిజన్లు. ఇంకా బిగ్ బాస్ సీజన్ 7 అవ్వక ముందే సీజన్ 8 గురించి సోషల్ మీడియాలో అప్పుడే చర్చలకు తెరలేపడం ఆశ్చర్యం కలిగిస్తోంది.