- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss-8: ఆ కంటెస్టెంట్‌కు రెడ్ కార్డు ఇచ్చి గెట్ అవుట్ అంటూ డోర్ ఓపెన్ చేయించిన నాగార్జున (వీడియో)
దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-8 సెప్టెంబర్ 1న మొదలై మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. మొదటి వారంలో బేబక్క ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ఇక రెండో వారంలో శేఖర్ భాషా వచ్చేశాడు. అయితే ఈ షోలో పలు వెరైటీ టాస్కులతో ఈ సీజన్‌ను బిగ్‌బాస్ మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే ప్రేక్షకులు టీవీల దగ్గర నుంచి కదలడం లేదు. వారం మొత్తం చేసిన తప్పొప్పులను ప్రస్తావించి నాగార్జున సీరియస్ అవుతారు. వీకెండ్ ఎపిసోడ్స్ కచ్చితంగా చూస్తారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ రోజు ప్రోమో విడుదలై అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇందులో వచ్చీ రాగానే నాగార్జున అభయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రెడ్ కార్డు ఇచ్చి బయటకు వెళ్లిపోమని డోర్స్ ఓపెన్ చేయించారు. దీంతో హౌస్‌మెట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా అయోమయంలో పడిపోయారు. నాగ్ అలా అనడంతో యష్మి బతిమిలాడుతుంది. అప్పుడే ప్రోమో అయిపోతుంది. ఇక ఇది చూసిన నెటిజన్లు అభయ్ ఉంటాడా లేక ఎలిమినేట్ చేసి ఇంటికి పంపిస్తారా? అని సాయంత్రం ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
(Credit to Star Maa YouTube channel)