స్టేజ్‌పైనే నాగార్జునను నిలదీసిన శివాజీ!

by Anjali |   ( Updated:2023-10-10 11:44:04.0  )
స్టేజ్‌పైనే నాగార్జునను నిలదీసిన శివాజీ!
X

దిశ, సినిమా: తాజాగా మొదలైన ‘బిగ్ బాస్’ తెలుగు ఏడో సీజన్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది. హౌస్‌లో ఉన్నప్పటికీ హౌస్ మెంబర్ కావాడానికి నానా తిప్పలు పడుతున్నారు కంటెస్టెంట్లు. ఇందులో భాగంగా రీసెంట్ ఎపిసోడ్‌లో సందీప్, శివాజీలల్లో ఎవరు అన్ డిస్వర్డ్‌ హౌజ్‌మేట్ అని అడగ్గా.. ప్రియాంక, శోభా శెట్టి, గౌతమ్, అమర్, తేజ, రతిక ఆరుగురు శివాజీ అని చేతులెత్తారు. ఇక సందీప్ విషయంలో ముగ్గురు మాత్రమే చేతులెత్తారు. దీంతో నాగార్జున మాట్లాడుతూ.. శివాజీ ఇక నుంచి ఇంటి మెంబర్‌ కాదని, అతని పవర్ అస్త్రా పగలగొట్టమని శోభా శెట్టితో చెప్పడంతో ఆమె శివాజీ పవర్ అస్త్రను పగలకొట్టింది. దీంతో శివాజీ తన పవర్ అస్త్ర కోల్పోయాడు. అయితే తాజాగా విడుదలైన ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో శివాజీ ‘నేను అన్ డిస్వర్డ్‌ హౌస్ మేట్‌ను ఎందుకు అయ్యాను. నాకు తెలిసి నేను ఎక్కడ తప్పు చేయలేదు’ అంటూ నాగార్జునను అడిగాడు. దీంతో నాగ్.. శోభ‌ను లేపి ‘అతనికి అర్హత లేదు అన్నారుగా.. నువ్వు సందీప్ కలిసి శివాజీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుని నాకు చెప్పండి’ అని చెప్పాడు. ప్రజంట్ ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed