Bigg Boss-8: అస్సలు ఊహించి ఉండరు.. ఈ వారం ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్?

by Hamsa |   ( Updated:2024-09-22 14:45:54.0  )
Bigg Boss-8: అస్సలు ఊహించి ఉండరు.. ఈ వారం ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్?
X

దిశ, సినిమా: రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-8 మొదలై మూడు వారాలు పూర్తి కావొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి 14 మంది కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొనగా.. మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్ బాషా ఇంటి నుంచి బయటకు రావడంతో 12 మంది ఉన్నారు. అయితే ప్రతి సీజన్‌లాగే అరుపులు, గొడవలు, లవ్ ట్రాక్స్, అలకలు బుజ్జగింపులు అన్ని జోరుగా నడుస్తున్నాయి. అయితే ప్రతి వారం లాగే ఈ వారం జరిగిన నామినేషన్స్‌లో నాగ మణికంఠ, సీత, ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, నైనిక, పృథ్వీరాజ్, సెల్ఫ్ నామినేట్ చేసుకున్న అభయ్‌తో మొత్తం 8 మంది ఉన్నారు.

ఈ క్రమంలో ఎలిమినేట్ అయ్యే మూడో కంటెస్టెంట్ ఎవరా అని అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే శనివారం ఎపిసోడ్‌లో అభయ్‌ మాటల వల్ల నాగార్జున రెడ్ కార్డు ఇచ్చి డోర్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్లిపో అన్నాడు. ఈ ఎపిసోడ్ చూసిన వారంతా షాక్‌లో ఉండిపోయారు. కానీ ఆ తర్వాత అభయ్‌తో పాటు హౌస్‌మెట్స్ కూడా రిక్వెస్ట్ చేయడంతో నాగ్ క్షమించేశాడు. అయితే హౌస్‌లో ఉన్న 12 మందిలో మూడో వారం ఎవరు ఇంటికి వెళ్లిపోతారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో తాజాగా, అందుతున్న సమాచారం మేరకు.. అభయ్ ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా, అభయ్ నవీన్ గేమ్ విషయానికొస్తే.. ఆయన మొదటి వారం నుంచి స్ట్రాంగ్‌గా అన్ని గేమ్స్ ఆడుతూ సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఆయన క్లాన్‌కి చీఫ్ కూడా అయ్యాడు. కానీ అతని మాటల వల్ల వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఆగ్రహానికి గురయ్యాడు.

Advertisement

Next Story