కంటెస్టెంట్స్‌కు నిద్ర లేకుండా చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్.. మహాబలి టీమ్ దొంగతనానికి స్కెచ్

by Hamsa |   ( Updated:2023-09-14 05:57:44.0  )
కంటెస్టెంట్స్‌కు నిద్ర లేకుండా చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్.. మహాబలి టీమ్ దొంగతనానికి స్కెచ్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర బిగ్‌బాస్ సీజన్ 7 ఇప్పటికే ఓ వారం పూర్తి అయింది. అయితే రెండో వారం టాస్క్‌లతో షో చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో నామినేషన్స్‌తో పాటుగా ‘మాయ అస్త్ర’ అని బిగ్‌బాస్ ఓ పోటీ పెట్టారు. హౌస్ మెట్స్‌ను రణధీర, మహాబలి అని రెండు భాగాలుగా విభజించాడు. ఇందులో శివాజీ, అమర్‌దీప్, ప్రిన్స్, ప్రియాంక, శోభాశెట్టి, షకిలా గెలిచారు. దీంతో ఓ తాళం చెవిని సొంతం చేసుకున్నారు. దాన్ని దొంగతనం చేయాలని మహాబలి టీమ్ ప్లాన్ వేసింది. తాళం సంపాదించమని బిగ్‌బాస్ చెప్పారు కానీ దొంగతనం చేయొద్దని చెప్పేలేదుగా అని తేజ డౌట్ పడతాడు. అప్పుడు గౌతమ్ తాళం కొట్టేద్దామని అంటాడు. అప్పటికే రాత్రి అయిపోవడంతో కంటెస్టెంట్స్ నిద్రపోకుండా కష్టపడ్డారు.

మహాబలి టీమ్ రతిక, శుభశ్రీ, గౌతమ్, తేజ, దామిని ప్రశాంత్ మాత్రం రణధీర గ్రూప్ దగ్గర ఉన్న తాళాన్ని కొట్టేయడానికి రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని ఉన్నారు. ఈ క్రమంలో హీరో శివాజీ శుభశ్రీ దగ్గరకు వచ్చి ఏం యాక్టింగ్ చేస్తున్నావ్’ అని అంటాడు. ఇది జరిగిన తర్వాత దామిని-రతిక-శుభశ్రీ రాత్రంతా తాళం కోసం జాగారం చేశారు. కానీ తాళాలు దొంగిలించ లేకపోయినా మహాబలి టీమ్ సభ్యులు సందీప్ గెలుచుకున్న పవర్ అస్త్ర దొంగిలిస్తారు. అలాగే ఆ తాళం ప్రిన్స్ దగ్గర ఉందనే విషయం తెలిసి అతని మహాబలి టీమ్ ఇబ్బంది పెడతారు. ఇక బిగ్‌బాస్ పెట్టిన పోటీల్లో నిలిచిన రణధీర్ సమూహానికి బిగ్‌బాస్ మాయ అస్త్ర ఇచ్చారు. అందులో ఆరు భాగాల్ని గ్రూపులో ఉన్న ఆరుగురు పంచుకున్నారు. వీళ్లందరూ కూడా పవర్ అస్త్ర పోటీలో ఉంటారని బిగ్‌బాస్ మరోసారి గుర్తు చేస్తాడు అంతటితో బుధవారం ముగుస్తుంది. మరి గురువారం ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఏ టాస్క్ ఇస్తాడో చూడాలి.

Read More: ఒక్కసారిగా శివాజీ శివతాండవం జిమ్‌లో వెయిట్స్‌ విసిరేస్తూ రచ్చ రచ్చ.. షాక్‌లో హౌస్‌మెట్స్

కంటెస్టెంట్స్‌కు నిద్ర లేకుండా చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్.. మహాబలి టీమ్ దొంగతనానికి స్కెచ్

Advertisement

Next Story