Bigg Boss-8: యష్మికి గట్టి షాకిచ్చిన మణికంఠ.. అదిరిపోయిన ప్రోమో-3

by Hamsa |   ( Updated:2024-10-04 14:47:52.0  )
Bigg Boss-8: యష్మికి గట్టి షాకిచ్చిన మణికంఠ.. అదిరిపోయిన ప్రోమో-3
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ ‘సీజన్-8’ మొదలై ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. నాలుగు వారాల్లో నలుగురు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. దీంతో హౌస్‌లో ప్రజెంట్ పది మంది మాత్రమే ఉండగా.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఓం కూడా ఎలిమినేట్ అయినట్లు సమాచారం. దీనిపై శనివారం ఎపిసోడ్‌లో క్లారిటీ రానుంది. అయితే బిగ్‌బాస్ షో రోజురోజుకు చాలా రసవత్తరంగా మారుతోంది. అయితే హౌస్‌మెట్స్‌కు ఇంటి మీద బెంగ మొదలైంది.

దీంతో బిగ్‌బాస్ ఆ బెంగ తీర్చేందుకు ఇంటి భోజనాన్ని ప్లాన్ చేయడంతో పాటు ప్రియమైన లేఖలు సైతం తెప్పించాడు. కానీ ఓ ఇద్దరు కంటెస్టెంట్స్‌ను పిలిచి తమ ఇద్దరికి సంబంధించిన ఫుడ్ పెట్టి ఒక్కరి మాత్రమే తీసుకుని వెళ్లాలని కండీషన్ పెట్టాడు. అయితే ముందుగా యష్మి, పిలిచి మణికంఠకు తన భార్య పంపిన ఫుడ్, నిఖిల్‌కు ఇంటి నుంచి ఫుడ్ వచ్చినట్లు చెప్పాడు.

దీంతో యష్మి మణికంఠది కాదని నిఖిల్‌ది తీసుకొని వెళ్తుంది. దీంతో అతను ఎంతో బాధపడతాడు. ఇదంతా రెండో ప్రోమోలో చూపించగా.. తాజాగా, విడుదలైన బిగ్‌బాస్ మూడో ప్రొమో అదిరిపోయింది. ఇందులో యష్మి, పృథ్వీకి వచ్చిన ఫుడ్‌ను నాగమణికంఠ ముందు పెట్టి ఒకటి సెలెక్ట్ చేసుకోమంటాడు. దీంతో అతను యష్మిది కాకుండా పృథ్వీకి వచ్చిన ఆహారం తీసుకెళ్లి గట్టి షాకిచ్చాడు. అదంతా టీవీలో చూసిన ఆమె నిఖిల్‌ను పట్టుకుని బోరున ఏడుస్తూ ఉంటుంది.


(Credit to Disney+Hot Star Telugu YouTube Channel)

Advertisement

Next Story