Bigg Boss-7: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు హౌస్‌లో భారీ ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్ (వీడియో)

by Anjali |   ( Updated:2023-10-10 15:39:40.0  )
Bigg Boss-7: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు హౌస్‌లో భారీ ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్ బాస్ సీజన్-7 ఇప్పుడిప్పుడే అట్టహాసంగా సాగుతోంది. హౌస్‌లో నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ స్టార్ట్ అయ్యింది. ఇందుకోసం బిగ్ బాస్ కంటెస్టెంట్లకు బ్యాంకు టాస్క్ ఇచ్చాడు. బ్యాంకర్స్‌గా శివాజీ, సందీప్, శోభా వ్యవహరిస్తారని బిగ్ బాస్ చెప్పాడు. టాస్క్ ముగిసే నాటికి ఏ కంటెస్టెంట్ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వారికి పవర్ అస్త్ర గెలుచుకుంటాడని చెప్పాడు. కాగా గార్డెన్ ఏరియాలో ఏటిఎంను ఏర్పాటు చేశారు. బజర్ మోగిన వెంటనే పరుగెత్తుకెళ్లి ఏటీఎంకు ఉన్న బటన్‌ను ప్రెస్ చేయాలి. ఈ టాస్క్‌లో అందరూ బటన్ నొక్కడానికి పరుగేత్తారు. ఈ క్రమంలో తోపులాట జరిగడంతో పల్లవి ప్రశాంత్ తలకు దెబ్బ తగులుతుంది. వెంటనే పక్కకు వచ్చి.. కుప్పకూలిపోతాడు. కంటెస్టెంట్లందరూ ఆందోళనగా పల్లవి ప్రశాంత్ చుట్టూ చేరుతారు. మరీ ప్రశాంత్‌కు తీవ్రంగా గాయమయ్యిందా? లేక స్వల్ప గాయమయ్యిందా? అనేది లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. ఈ సంఘటనంతా లేటెస్ట్ ప్రోమోలో చూపించారు.

Advertisement

Next Story