Bigg Boss-7: నాలుగు వారాలకు రతిక తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

by Hamsa |
Bigg Boss-7: నాలుగు వారాలకు రతిక తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీన్-7 ఈ సారి మరింత ఆసక్తికరంగా మారింది. ఉల్టా పుల్టా ఉంటుందని ఈ షో హోస్ట్ నాగార్జున ముందే తెలిపారు. ఇక ఈ సీజన్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగా.. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ప్రతి వారం కంటెస్టెంట్స్ టాస్క్‌ల్లో పాల్గొంటూ రచ్చ చేస్తున్నారు. అలాగే ఇందులోని లేడీ కంటెస్టెంట్ రతిక రోస్, పల్లవి ప్రశాంత్‌తో చనువుగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్శించింది. ఇటీవల మాత్రం అతడితో గొడవ పడి మాట్లాడకుండా ఉంది. ఇక రతికాను అక్క అనడంతో పాటు ప్రశాంత్, రతికకు క్షమాపణలు చెప్పాడు. ఇక పవర్ అస్త్ర పోటీల్లో కూడా ప్రశాంత్ ను ఓడించేందుకు రతికా అమర్ దీప్ తో కలిసి చిల్లర చేష్టలు చేసింది. ఇక దీనిపై నాగార్జున క్లాస్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే.. నాలుగో వారం ఎవ్వరూ ఊహించని విధంగా రతిక రోస్ ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. తాజాగా, రతిక బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగు వారాలు ఉన్నందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనేది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక నాలుగు వారాలకు రతిక దాదాపు రూ.8లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వారానికి 2 లక్షల రూపాయలు తీసుకుందని టాక్.

Advertisement

Next Story

Most Viewed