- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rathika Rose : భారీ ట్విస్ట్: బిగ్ బాస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న రతికా రోజ్..?
దిశ, వెబ్‌డెస్క్: 14 మంది కంటెస్టెంట్లతో మొదలైన తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 మొదట్లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ప్రస్తుతం అట్టహాసంగా సాగుతోంది. హౌస్‌లో ఆల్రెడీ ఎలిమినేషన్స్ కూడా మొదలయ్యాయి. ట్విస్ట్ ఏంటంటే.. వరుసగా నలుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎంతో యాటిట్యూట్ చూపించే రతిక ఎలిమినేట్ అవ్వడం జనాలు అస్సలు ఊహించలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో రతికా రోజ్ ఫ్యాన్స్ ఆమెకు ఓ ఛాన్స్ ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు తెలియక అనుకొని కారణాలతో గేమ్ తప్పుదోవ పట్టింది. కాబట్టి రతికకు మళ్లీ ఒకసారి అవకాశం ఇవ్వాలని అంటున్నారు.
సీజన్-3లో కంటెస్టెంట్ అలీ రెజా 7వ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఆడియన్స్ డిమాండ్ మేరకు అతడికి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. దాంతో ఫైనల్‌కు వెళ్లిన అలీ రెజా 4వ స్థానంలో నిలిచాడు. అలాగే సీజన్ 2లో నూతన నాయుడు అనే కంటెస్టెంట్ కాలికి గాయమయింది. బయట ట్రీట్మెంట్ తీసుకుని మరలా హౌస్లోకి వచ్చాడు. కాగా రతికకు కూడా ఇలాగే ఆహ్వానించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంతమంది డిమాండ్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా రతిక మళ్లీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తుంది చూడండని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. గత సీజన్‌లాగే ఆడియన్స్ కోరిక మేరకు రతిక మళ్లీ హౌస్‌లోకి వెళ్లనుందా? లేదా? అనేది చూడాలి.
అలాగే ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వెళ్లనున్నారట. ఇది మినీ లాంచింగ్ ఈవెంట్ లాంటిదని తెలుస్తోంది. అక్టోబర్ 8 ఆదివారం మరో లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ ద్వారా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్‌ను ఇంట్లోకి పంపనున్నారని సమాచారం. జబర్దస్త్ కెవ్వు కార్తీక్ అట. అలాగే సీరియల్ నటుడు అంబటి అర్జున్, సీరియల్ నటి పూజా మూర్తి, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షామిలి, సీరియల్ నటి అంజలి పవన్, సీరియల్ నటి నయని పావని హౌస్‌లో అడుగుపెడుతున్నారని తాజా సమాచారం. గతంలో ఎన్నడూ చేయని ఈ ప్రయోగం ప్రేక్షకులకు కిక్ ఇవ్వనుందని నెటిజన్లు అంటున్నారు.