- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాగార్జునకు బిగుస్తున్న ఉచ్చు.. బిగ్‌బాస్ షోపై HRCలో ఫిర్యాదు (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. హైకోర్టు న్యాయవాది అరుణ్ ఇవాళ హెచ్ఆర్‌సీలో కంప్లైట్ చేశారు. బిగ్ బాస్ షో పై సమగ్ర దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. బిగ్ బాస్ షో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద వీరంగం సృష్టించారని తెలిపారు. ఎనిమిది ఆర్టీసీ బస్సులు, కార్లను ధ్వంసం చేశారని, షో ముగిసిన అనంతరం బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి జరిగిన గొడవపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారని, కానీ ఎక్కడా బిగ్ బాస్ షో హోస్ట్, హీరో నాగార్జున పేరు చేర్చలేదని తెలిపారు. ఈ ఘర్షణలో హీరో నాగార్జునను సైతం బాధ్యులను చేసి, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని న్యాయవాది అరుణ్ హెచ్ఆర్‌సీని కోరారు. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టులోనూ పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు.