బోయపాటి సినిమాలో భూమిక నెగటివ్ రోల్?

by Shyam |
బోయపాటి సినిమాలో భూమిక నెగటివ్ రోల్?
X

భూమిక చావ్లా… ఖుషి, వాసు, ఒక్కడు, సింహాద్రితో పాటు పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. గ్లామర్ టచ్ ఇస్తూనే… నటనా ప్రాధాన్యమున్న చిత్రాల్లో చేసి తానేంటో నిరూపించుకుంది. కెరియర్ చక్కగా సాగుతున్న క్రమంలోనే భరత్ ఠాకూర్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది అంటారు. దీంతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది భూమిక. సవ్యసాచి లో చైతూకి అక్కగా, ఎంసీఏ లో నానికి వదినగా మంచి పాత్రలు దక్కించుకుంది. ఇన్నాళ్లు సాప్ట్ అండ్ పాజిటివ్ క్యారెక్టర్స్ కు ఓటేసిన భూమిక … ఇప్పుడు నెగటివ్ రోల్ చేయబోతోందట.

బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో విలన్ రోల్ చేయబోతోందట భూమిక. ఫుల్ లెంత్ నెగటివ్ రోల్ కు ఏరి కోరి సెలెక్ట్ చేశారట. కానీ ఈ వార్త విన్న తర్వాత విలనిజం ప్రదర్శించడం భూమికకు సాధ్యం అవుతుందా అనే ప్రశ్న మెదులుతుంది అందరిలో. లాక్ డౌన్ కాలం ముగిశాక సినిమా షూటింగ్ మొదలు కానుందట. కాగా ఈ సినిమాలో కమెడియన్ సునిల్ కూడా నెగటివ్ రోల్ చేస్తున్నారని సమాచారం. డిస్కో రాజాలో విలన్ గా చేసిన సునిల్ కు మంచి గుర్తింపు రాగా … బోయపాటి ఈ సినిమాలో విలన్ గా సునిల్ ను ఎంచుకున్నారు.

Tags: Bhumika chawla, Bhumika, Boyapati, Balakrishna, Negative role

Advertisement

Next Story