గాల్వన్ లోయకు టీ90 భీష్మ ట్యాంక్‌లు

by Shamantha N |
గాల్వన్ లోయకు టీ90 భీష్మ ట్యాంక్‌లు
X

న్యూఢిల్లీ: చైనా దుస్సాహసాలకు పాల్పడితే తిప్పికొట్టేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధమవుతున్నది. గాల్వన్ లోయ సమీపంలో చైనా ఆర్మీ మోహరింపులు పెరిగిన నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమై డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్‌లు, ఇతర వ్యవస్థలను సరిహద్దు దగ్గరకు తరలిస్తున్నది. తాజాగా, టీ 90 భీష్మ ట్యాంక్‌లనూ గాల్వన్ లోయకు తరలించింది. శత్రుదేశ క్షిపణులు కుప్పకూల్చే ఆరు టీ 90 భీష్మ ట్యాంక్‌లను ఆర్మీ మోహరిచింది. అలాగే, అధునాతన యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్‌లను సరిహద్దుకు పంపింది. ఎల్ఏసీకి ఇటువైపునే భారత బలగాలు భారీగా మోహరిస్తున్నాయి. శాంతి చర్చలు జరుగుతున్నా చైనా సరి‘హద్దులను’ మీరుతోంది. బలగాలను ఉపసంహరిస్తామని చెబుతూనే భారత భూభాగంలోకి క్రమంగా పంపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే చైనా ఆకస్మిక దాడులకు పాల్పడితే, సరిహద్దు స్వాధీన లక్ష్యాన్ని చేపడితే దేశ సార్వభౌమత్వ, సమగ్రతను కాపాడే లక్ష్యంతో భారత్ బలగాలను బార్డర్‌కు తరలిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed