- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఎమ్మెల్యే కాంట్రాక్టుల కోసం పార్టీ మారారు.. భట్టి సంచలన ఆరోపణలు
దిశ, నేలకొండపల్లి: టీఆర్ఎస్, బీజేపీలు రైతుల మీద యుద్ధం చేస్తుంటే.. కాంగ్రెస్ రైతుల తరఫున పోరాటం చేస్తోందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సమావేశంలో భట్టి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే టీఆర్ఎస్, బీజేపీలకు చరిత్ర లేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసి, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిందన్నారు. పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు కాంగ్రెస్ పార్టీ పునాదులు వేసిందన్నారు.
టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నియంతలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ టికెట్ కోసం తిరిగిన పాలేరు శాసన సభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే పార్టీ మారారని విమర్శించారు. టికాణాకు పనికిరాని వ్యక్తిని హస్తం గుర్తు గెలిపించిందని, అలాంటి పార్టీకి ద్రోహం చేసి ప్రజల ఓట్లను తన కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వడ్ల కోసం రైతులు పక్షాన నిలబడతారో లేక కాంట్రాక్టులు వస్తే చాలనుకుంటారో? ఎమ్మెల్యే ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.