నిరాడంబరంగా గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలి

by Shyam |
నిరాడంబరంగా గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలి
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గణేశ్ ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పిలుపు నిచ్చింది. గత నాలుగు నెలలుగా ఆర్థిక సంక్షోభం నగర ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని గుర్తు చేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఉత్సవాలను ఆరోగ్య సంస్థ నియమాలకు అనుగుణంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆగస్టు 22న ప్రారంభమై సెప్టెంబర్ 1న ముగిసే వినాయక ఉత్సవాలను ఆడంబరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జరుపుకోవాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed