- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంగాల్ ఫలితాలు.. యూపీ ఎన్నికలపై ప్రభావం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద పడే అవకాశం ఉన్నదని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు యశ్వంత్ సిన్హా అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిన్హా మాట్లాడుతూ.. బెంగాల్ ఎన్ని్కల ఫలితాల ప్రభావం వచ్చే ఏడాది యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024 లో జరిగే లోక్‌సభ ఎన్నికల మీద పడే అవకాశం ఉన్నదని అన్నారు.
బెంగాల్ లో బీజేపీ దారుణ పరాజయానికి బాధ్యత వహిస్తూ మోడీ, అమిత్ షా, బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్, జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవర్గియ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బెంగాల్ ఎన్నికలలో భాగంగా బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలలో కనిపించిన వారిలో చాలామంది జార్ఖండ్, బీహార్ నుంచి తీసుకొచ్చిన వారేనని ఆయన ఎద్దేవా చేశారు. బెంగాల్ సీఎం దీదీని దుర్భాషలాడుతూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను ఆగ్రహాం తెప్పించాయని.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమని సిన్హా తెలిపారు.