ఏడిస్తే ఎన్ని లాభాలో.. మీరే తెలుసుకోండిలా

by sudharani |   ( Updated:2021-12-27 01:10:15.0  )
ఏడిస్తే  ఎన్ని లాభాలో.. మీరే తెలుసుకోండిలా
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది ఎవరైనా ఏడుస్తే ఏడుపుగొట్టు మొహం ఎప్పుడూ ఏడుస్తుంది అంటారు. కానీ ఏడవడం వలన కలిగే ప్రయోజనాలు తెలుస్తే ఇక ఎవరూ మిమ్ముల్ని ఎందుకు ఏడుస్తున్నావు అనరు. ఏంటీ ఏడుపు వలన ప్రయోజనాలు.., ఏడవమని చెబుతోంది.. నవ్వమని చెప్పచ్చుగా.. నవ్వడమే ఆరోగ్యానికి మంచిది కదా అనుకుంటున్నారా.. అయితే నవ్వడం వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో ఏడిస్తే కూడా అన్నే ప్రయోజనాలున్నాయి. మనం అప్పుడప్పుడు ఏడవడం వలన అది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆ మేలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏడవడం ద్వారా ప్రయోజనాలు..

1. మనం అప్పుడప్పుడు ఏడవటం వలన మన కంటిలోంచి కన్నీరు వస్తుంది. ఆ కన్నీళ్ల ద్వారా మన కళ్లలో ఉండే దుమ్ము,మలినాలు బయటకు పోతాయి. దీంతో కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్ క్రిములు, బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తుంది.
2. అప్పుడప్పుడు ఏడవటం ద్వారా మన బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యల బారిన పడటాన్ని తగ్గిస్తుంది.
3. ఎక్కువ సమయం ఏడవడం వల్ల ఆక్సిటోసిన్, ఇండ్రాఫిన్ వంటి రసాయనాలు విడుదల అవుతాయి. ఇది ఫీల్ గుడ్ రసాయనం కావడంతో శారీరక, మానసిక భావోద్వేగాల సంబంధించిన మార్పులు కలుగుతాయి. వీటి వల్ల నొప్పిని తట్టుకునే సామర్థ్యం వస్తుంది.
4. ఏడుపు డిప్రెషన్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
5.ఏడవడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకుపోతాయి. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
6. కన్నీళ్లు కంటికి ఒక వ్యాయామంలాగా కూడా పనిచేస్తాయి.దీనివల్ల కళ్లు ప్రశాంతతను కలిగి ఉంటాయి.
7. ఏడుపు వల్ల ఎమోషనల్‌, ఫిజికల్‌ బాధలు తగ్గుతాయి.
8. ఏడవడం వలన మనలో ఉన్న బాధ తగ్గి మనస్సు తేలిక అవుతోంది.

Advertisement

Next Story