‘ఛత్రపతి’గా బెల్లంకొండ..

by Jakkula Samataha |
‘ఛత్రపతి’గా బెల్లంకొండ..
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘అల్లుడు శీను’గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్’ అనిపించుకుంటున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. త్వరలో బాలీవుడ్‌లోనూ అదుర్స్ అనిపించుకునేందుకు రెడీ అయిపోతున్నాడు. తొలి సినిమాలోనే యాక్షన్ యాంగిల్ చూపించిన శ్రీనివాస్.. వరుసగా ‘స్పీడున్నోడు, జయ జానకీ నాయక’ లాంటి సినిమాల ద్వారా యాక్షన్ హీరోగానూ ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం చేస్తున్న ‘అల్లుడు అదుర్స్’ కూడా ఫ్యామిలీ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్ మూవీ అని తెలుస్తుండగా.. లేటెస్ట్‌గా శ్రీనివాస్‌ను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సంప్రదించారని సమాచారం.

రెబల్ స్టార్ ప్రభాస్, జక్కన్న కలయికలో వచ్చిన ఫుల్ టు యాక్షన్ మూవీ ‘ఛత్రపతి’ సినిమా రీమేక్‌లో తనను హీరోగా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఇప్పటికే రీమేక్ రైట్స్ కొనుగోలు చేయగా.. బాలీవుడ్‌కు చెందిన ఓ డైరెక్టర్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారని టాక్. కాగా ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీనివాస్‌.. బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు ఈ సినిమానే కరెక్ట్ అంటున్నారు విశ్లేషకులు. ఎలాగూ యాక్షన్ హీరో అయిన శ్రీనివాస్.. రాక్షసుడు సినిమాతో తనలోని నటుడిని పరిచయం చేశాడని, ఇంకొంచెం కష్టపడితే ప్రభాస్‌తో సమానంగా నటించాడనే పేరు సంపాదించుకోవచ్చని అంటున్నారు.

కాగా ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అను ఇమ్మాన్యూయల్, నభా నటేష్ హీరోయిన్లు కాగా.. ప్రకాష్ రాజ్, సోనూసూద్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే ఛత్రపతి రీమేక్ స్టార్ట్ కానుంది.

Advertisement

Next Story