కేసీఆర్ లక్ష ఇస్తుండు.. నాకెంత ఇస్తవ్..?

by Shyam |
cm-kcr
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆడపిల్ల పెళ్లి చేసి పేదోళ్లు అప్పులపాలు కావద్దనే ‘కళ్యాణలక్ష్మి’ పథకాన్ని తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ, ఇందులోనూ అవినీతి జరుగుతున్నదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అధికారులు ‘కేసీఆర్ లక్ష ఇస్తుండు.. నాకేమిస్తావ్’ అని ప్రజల నుంచి లంచం ఆశిస్తున్నారని మండిపడ్డారు.

అలా.. ఎవరైనా అడిగితే.. దవడ పగలగొట్టుండ్రి ఏమన్నా అయితే నేను చూసుకుంటా అన్నారు. ఇద్దరు ముగ్గురిని దవడ మీద సరిస్తేనే అందరూ సక్కగైతరు, ఎక్కడికక్కడ నిలదీస్తేనే వాళ్లకి సిగ్గొస్తది అని వ్యాఖ్యలు చేశారు. ఇలా లంచం ఇవ్వడాన్ని నిషేధించాలని సీఎం కేసీఆర్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed