- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గడ్డం.. అందానికే కాదు ఆరోగ్యానికి కూడా!
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ వల్ల దాదాపు రెండు నెలలు సెలూన్ షాపులన్నీ మూతపడ్డాయి. ఈ టైమ్‌లో చాలామంది జుట్టు, గడ్డాలు పెంచుకుని గుర్తుపట్టకుండా తయారయ్యారు కూడా. వీరి విషయం పక్కనబెడితే కొంతమంది స్టైల్ కోసమే గడ్డం పెంచుతుంటారు. అలా గడ్డం పెంచడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. గడ్డం ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుందని ఫ్యాషన్ ప్రియులు అంటున్నారు.
‘ఏంట్రా ఆ గడ్డం.. విలన్‌లాగా ! నీట్‌గా ఉండొచ్చు కదా? అని అమ్మ తిడుతుంటుంది. పిచ్చోడిలా ఏంటా గుబురు గడ్డం.. సాయంత్రానికి ఆ గడ్డం తీసేయ్ అని’ నాన్న ఓ స్వీట్ వార్నింగ్ ఇస్తారు. అయితే ఎందరు ఏమన్నా.. గడ్డం తీయని యువకులు, గడ్డాన్ని ప్రేమించే వీర ప్రేమికులు ఉంటూనే ఉంటారు. కానీ, ఇప్పుడు గడ్డం పెంచడమూ ఓ ట్రెండ్‌గా మారింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ గుబురు గడ్డాలు.. స్టైలిష్ బియర్డ్‌తో కొత్త లుక్‌లో కనిపించడం మామూలైపోయింది. స్టైలింగ్, లుక్‌లను పక్కన పెడితే.. గడ్డం పెంచుకోవడం వల్ల అనేక చర్మవ్యాధుల నుంచి దూరం కావొచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సూర్యుడి నుంచి విడుదలయ్యే రేడియేషన్ కిరణాలు నేరుగా ముఖంపై పడవు. ఫలితంగా చర్మం నల్లగా మారడం, సూర్యరశ్మి తగిలి కమిలిపోవడం వంటి సమస్యలు ఉండవని తెలుపుతున్నాయి.
అల్ట్రా వయొలెట్ కిరణాలు 95 శాతం వరకు చర్మంపై పడకుండా గడ్డం నిరోధిస్తుందని ఓ పరిశోధనలో తేలింది. ముఖంపై ముడతలు రాకుండా ఉండేందుకు, జీర్ణాశయ సమస్యలను తగ్గించేందుకు గడ్డం సహాయపడుతుందట. సాధారణంగా క్లీన్‌గా షేవ్ చేసుకున్న ప్రతీసారి చర్మం మాయిశ్చరైజేషన్ కోల్పోతుంటుంది. దీనివల్ల బ్యాక్టిరియా పెరిగి ఇన్ఫెక్షన్‌తో మొటిమలు పెరుగుతాయి. కానీ, గడ్డం పెంచినప్పుడు సెబాసియస్(కొవ్వు) గ్రంథులు చర్మాన్ని తేమగా ఉంచడంతో ముఖంపై మచ్చలు కూడా చాలా వరకు తగ్గుతాయట. అంతెందుకు క్లీన్‌షేవ్‌తో కనిపించేవారి కంటే గడ్డంతో కనిపించేవారినే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారనే విషయాన్ని గతంలో పలు అధ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గడ్డం పురుషులకు ఆత్మవిశ్వాసంతో పాటు శక్తిని కూడా ఇస్తుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.