సెలెక్టర్ల నియామకానికి BCCI దరఖాస్తుల ఆహ్వానం

by Shyam |
సెలెక్టర్ల నియామకానికి BCCI దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, స్పోర్ట్స్ : ప్రస్తుతం కొనసాగుతున్న సెలెక్టర్లలో ముగ్గురి పదవీకాలం ముగియనుండటంతో కొత్త వాళ్ల కోసం BCCI దరఖాస్తులు ఆహ్వానిస్తూ మంగళవారం ప్రకటన జారీ చేసింది. కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవంతో పాటు 60 ఏళ్ల లోపు ఉన్న క్రికెటర్లు సెలెక్టర్లుగా అర్హులని బీసీసీఐ పేర్కొన్నది. నవంబర్ 15లోగా ఈ దరఖాస్తులు పంపాలని కోరింది. ఈస్ట్ జోన్‌కు చెందిన దేవంగ్ గాంధీ, నార్త్ జోన్ సరన్‌దీప్ సింగ్, వెస్ట్ జోన్ జతిన్ పరాంజపేల పదవీకాలం ముగిసింది.

కొత్తగా దరఖాస్తులు చేసుకునే వాళ్లు ఈ జోన్లకు చెందిన వారే అయి ఉండాలి. గతంలో దరఖాస్తు చేసుకున్న అజిత్ అగార్కర్, మణీందర్ సింగ్‌ల దరఖాస్తులు చెల్లుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. కాగా, కొత్తగా ఎంపికయ్యే సెలెక్టర్లలో ఎవరైనా ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ సునిల్ జోషీ కంటే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంటే.. వారినే చీఫ్ సెలెక్టర్‌గా నియమిస్తామని పేర్కొన్నది. ఎంపికైన సెలెక్టర్లు టీమ్ ఇండియా, ఇండియా ఏ, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీతో పాటు ఇరానీ కప్‌కు జట్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed