- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉన్న వారితోనే ఆడించండి : బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన పంత్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ దయానంద్ గరానీకి కరోనా రావడం.. అతడితో సన్నిహితంగా మెలిగిన వృద్దిమాన్ సాహ, బ్యాకప్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో తమకు మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ను బ్యాకప్ కోసం పంపించాలని టీమ్ ఇండియా యాజమాన్యం కోరింది. దీనికి బీసీసీఐ తిరస్కరించినట్లు బోర్డు అధికారి ఒకరు చెప్పారు.
ఇప్పటికే అక్కడ బ్యాకప్ కూడా అందుబాటులో ఉన్నదని.. అలాంటప్పుడు అక్కడికి అదనంగా క్రికెటర్లు ఎందుకని ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. జట్టులో పంత్, సాహ తప్ప మిగతా టీమ్ అంతా సేఫ్ గానే ఉన్నది. కేఎల్ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకుంటే కీపింగ్‌తో పాటు ఓపెనింగ్ కూడా చేయగలడు. అంతే కాకుండా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా అందుబాటులో ఉన్నాడు. ఇన్ని ఆప్షన్లు ఉంచుకోని కూడా మళ్లీ బ్యాకప్ కావాలని అడగటం ఏంటని బీసీసీఐ ప్రశ్నిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ఆటగాళ్లను ఇంగ్లాండ్ పంపేది లేదని.. ఉన్న ఆటగాళ్లతోనే సిరీస్ ముగించుకొని రావాలని ఆదేశించినట్లు తెలిసింది.