బీసీసీఐ కార్యాలయానికి తాళం..

by Shamantha N |
బీసీసీఐ కార్యాలయానికి తాళం..
X

కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో ఇప్పటికే ఐపీఎల్‌ను వాయిదా వేసిన బీసీసీఐ.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పించింది. దీంతో ముంబై వాంఖడే స్టేడియంలో ఉన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి తాళాలు పడ్డాయి. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా, ఇతర అధికారులు కూడా ఆన్‌లైన్ ద్వారానే తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక బీసీసీఐ బాటలోనే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా నిర్ణయం తీసుకుంది. ఈడెన్ గార్డెన్స్‌లోని క్యాబ్ కార్యాలయాన్ని మూసేసి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పించింది.

Tags : BCCI Central office, work from Home, Sourav Ganguly, Jay shah, Cab

Advertisement

Next Story