బీసీ గణన పోరాటం ఆగదు.. బీసీ సంక్షేమ సంఘం హెచ్చరిక

by Shyam |
బీసీ గణన పోరాటం ఆగదు.. బీసీ సంక్షేమ సంఘం హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీల గణన జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బీసీల ఆకాంక్షలను నెరవేర్చుకుంటామన్నారు. బీసీలను నిర్లక్ష్యం చేస్తే త్వరలోనే హైద్రాబాద్ లో జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కేంద్రం కాదు ,కూడదు అంటే దేశంలో అగ్గి మండిస్తాం అంటూ ఆయన హెచ్చరించారు. వారం రోజుల ఢిల్లీ ఉద్యమాన్ని విజయవంతం చేసిన బీసీ శ్రేణులకు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు, ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్​ దోమల్​ గూడ లోని బీసీ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బీసీ గణన కోసం ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలు విజయవంతం అయ్యాయని తెలిపారు. మద్ధతు తెలిపిప ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్,సదానందం, జాజుల లింగం గౌడ్,మాదేశి రాజేందర్, మనిమంజరి, శివరాని ఠాకూర్, సంధ్య రాణి, రేణుక, గౌతమి, స్వర్ణ, శివరాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story