- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీసీ కుల గణన చేయాలి.. బీసీ సంఘాలు డిమాండ్

X
దిశ, తెలంగాణ బ్యూరో: జనగణనతో పాటు బీసీ కుల గణన చేయాలని ఐక్య బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని సిటీ సెంట్రల్ కోర్ట్ సమావేశ మందిరంలో జన గణనలో బీసీ లెక్కలు తీయాలని అఖిలపక్షం, బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ 2019 లో జనగణన చేస్తామని తీర్మానం చేసి విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు బీసీ కుల గణన చేయాలని తీర్మానం చేశాయని, అయినప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, నేతలు ఎల్.రమణ, వి.హనుమంతరావు, రాజారామ్ యాదవ్, నర్సింగరావు, గుజ్జ సత్యం, రామలింగం, కోల జనార్ధన్, కృష్ణ, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story