- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
40వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి
దిశ, వెబ్‌డెస్క్ :
రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్టులు, కమీషన్ల మీదున్న శ్రద్ధ నిరుద్యోగుల మీద లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యా శాఖ డైరక్టరేట్ ఆఫీసును గురువారం ఆయన ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. 40 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ, TETను త్వరగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ఎన్ని నిరసనలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి తక్షణమే నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల్లో ఏడాదికి ఒక్క DSC వేస్తారని, ఏపీలో కూడా గత 6 ఏళ్లల్లో 3 సార్లు DSC వేశారని.. వారిని చూసి సీఎం కేసీఆర్ సిగ్గు తెచ్చుకోవాలన్నారు.
చివరికి పేద రాష్ట్రమైన బీహార్ లోనూ నియామక ప్రక్రియ సక్రమంగా జరిగిందన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేబినెట్‌లోనే చదువు రాని ముగ్గురు మినిస్టర్లు ఉండటం శోచనీయమన్నారు.ప్రభుత్వం వెంటనే నియామక ప్రక్రియ చేపట్టకపోతే వేలాది మంది నిరుద్యోగులతో ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలు ముట్టడిస్తామని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.