Priyanka Chopra : అవార్డ్ ఫంక్షన్‌లో రొమాంటిక్ టచ్..

by Shyam |   ( Updated:2021-05-24 01:42:37.0  )
Priyanka Chopra, Nik Jonas
X

దిశ, సినిమా: 2021 బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్‌కు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌ కొత్త అందాన్ని తీసుకొచ్చారు. సోమవారం ఉదయం జరిగినఈ అవార్డు సెర్మనీ కార్యక్రమానికి నిక్ జోనస్ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఓ అవార్డు అందజేయాల్సి ఉండటంతో పాటు నిక్‌కు తోడుగా ఉండేందుకు లండన్ నుంచి లాస్‌ఏంజెల్స్‌కు వెళ్లింది ప్రియాంక. ఈ సందర్భంగా పీసీ ధరించిన డ్రెస్.. మొత్తం వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం. టాప్ టు బాటమ్ గోల్డ్ కలర్‌లో క్రిస్టల్స్ పరుచుకున్న ఫుల్ స్లీవ్‌డ్ గౌను, నడుముకు మెటల్ లేస్‌అప్ కార్సెట్ బెల్ట్‌తో ప్రియంక మోస్ట్ ఐకానిక్‌గా దర్శనమిచ్చింది. నెక్‌లైన్ అవుట్‌ఫిట్స్‌లో తను, బాటిల్ గ్రీన్ డ్రెస్‌లో నిక్‌ చేతిలో చెయ్యేసుకుని రెడ్ కార్పెట్‌పై నడుస్తున్న దృశ్యం ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది. ఇక వారి ట్రేడ్ మార్క్ ‘లుక్ ఆఫ్ లవ్’ పోజ్ కూడా మ్యూజిక్ అవార్డ్స్‌కు అట్రాక్షన్ తీసుకొచ్చింది.

Priyanka Chopra

Advertisement

Next Story

Most Viewed