- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిత్తూరులో దారుణం: బావను చంపిన బావమరిది
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరసకు బావ అయిన వ్యక్తిని బావమరిది హతమార్చాడు. క్షణికావేశంలో బావపై కోపంతో మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు. తమ్ముడికి సహకరించింది అనే అనుమానంతో అక్కను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పలమనేరు మండలం పందేరుపల్లికి చెందిన నాగరాజుకు, కెటిల్ ఫార్మ్‌కు చెందిన భాగ్యలక్ష్మీకి 20 ఏళ్ళ క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే పెద్ద కుమార్తెకు పెళ్లి చేయాలని దంపతులు సంబంధాలు చూస్తున్నారు. నాగరాజు భార్య బాగ్య లక్ష్మీకి సమీప బంధువు.. వరుసకు తమ్ముడైన నవీన్ కు ఇచ్చి వివాహం చేయాలని భాగ్యలక్ష్మీ నాగరాజును కోరింది. అయితే అందుకు నాగరాజు ఒప్పుకోలేదు. దీంతో భాగ్యలక్ష్మీ మనస్తాపం చెందింది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో గత 3నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే గత నెల 5న భాగ్యలక్ష్మీ పుట్టింటికి వెళ్లిన నాగరాజు.. అమ్మఒడి నగదు ఇవ్వాలని భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరగటంతో లక్ష్మీని కొట్టాడు. అక్కపై చేయిచేసుకోవడం చూసిన నవీన్ బావ నాగరాజుపై కోపంతో రగిలిపోయాడు.
అమ్మాయిని తనకు ఇవ్వకపోవడం.. అక్కపై చేయిచేసుకోవడంతో రగిలిపోయిన నవీన్ గత నెల 12 ఫుల్ గా మద్యం సేవించాడు. తాగిన మైకంలో నాగరాజు తలపై బండరాయితో మోదీ చంపేశాడు. అంతేకాదు బావ శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. ఇంటి ఆవరణలో ఉన్న ఓ గుంటలో పూడ్చిపెట్టాడు. అయితే నాగరాజు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నాగరాజు ఊరి నుంచి బయటకు వెళ్లిన ఆనవాళ్ళు లేకపోవడంతో హత్య జరిగి ఉంటుందని అనుమానించిన పోలీసులు కుటుంబ సభ్యులను విచారించారు. నవీన్ పై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే తన బావను హత్య చేసినట్టు పోలీసులకు వెల్లడించాడు. దీంతో భార్య భాగ్యలక్ష్మీని., బావమరిది నవీన్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.