అక్టోబర్ 16నుంచి బతుకమ్మ ప్రారంభం..!

by Anukaran |   ( Updated:2020-09-14 10:12:15.0  )
అక్టోబర్ 16నుంచి బతుకమ్మ ప్రారంభం..!
X

దిశ, వెబ్‎డెస్క్: బతుకమ్మ పండుగను ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి 24వ తేదీ వరకు జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. పండుగ జరుపుకునే తేదీలపై ప్రముఖ సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులతో కూడిన ‘తెలంగాణ విద్వత్సభ’తో కల్వకుంట్ల కవిత సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ‘తెలంగాణ విద్వత్సభ’ రాష్ట్ర అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన శర్మ, ఇతర పండితులు పాల్గొన్నారు.

అధిక ఈశ్వీయుజ మాసం కారణంగా శ్రీ శార్వరి నామ సంవత్సరంలో వచ్చే బతుకమ్మ పండుగ తేదీలపై చర్చించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను తెలంగాణ జాగృతి ఘనంగా నిర్వహిస్తున్నందున.. బతుకమ్మ తేదీల గురించి తనను చాలా మంది సంప్రదించారని తెలిపారు. ప్రతి 19ఏళ్లకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఎదురైతుందని వేద పండితులు వివరించారని చెప్పారు. పండితులు, సిద్ధాంతులు చెప్పిన ప్రకారం అక్టోబర్ 16న బతుకమ్మను ప్రారంభించాలని తెలంగాణ ఆడపడుచులను కోరారు.

Read Also…

బతుకమ్మ సంబురాలకు ముహూర్తం ఫిక్స్..!

Advertisement

Next Story