బతుకమ్మ సంబురాలకు ముహూర్తం ఫిక్స్..!

by  |
బతుకమ్మ సంబురాలకు ముహూర్తం ఫిక్స్..!
X

దిశ, వెబ్ డెస్క్: తీరొక్క పువ్వులను అందంగా పేర్చి పూజించే బతుకమ్మ పండగను తెలంగాణాలో ప్రతియేటా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ల దాకా ఆడపడుచులంతా కలిసి ఆడుకునే పండగ బతుకమ్మ.

ప్రతి ఏడాది అక్టోబర్ లో ఈ పండగను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది అధిక ఆశ్వీయుజ మాసం వచ్చినందున బతుకమ్మ పండుగపై కొంత సందిగ్ధం నెలకొంది. అయితే ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి స్పష్టతనిచ్చింది.

అక్టోబర్ 17న ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోవాలని దానికోసం ఏర్పాట్లు చేయాలని బ్రాహ్మణ సేవా సమితి తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. అక్టోబర్ 24వరకు బతుకమ్మను ఎనిమిది రోజులు పేర్చి, పూజించి నిమజ్జనం చేయాలని సూచించింది. కానీ ఈసారి కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో బతుకమ్మ సంబురాలకు ప్రభుత్వం అనుమతిస్తుందా… లేదా? అనే సందిగ్ధత నెలకొంది.



Next Story

Most Viewed