క్రాఫ్టన్ ఆ అకౌంట్స్‌ను ఎందుకు నిషేధించిందంటే?

by Shyam |
క్రాఫ్టన్ ఆ అకౌంట్స్‌ను ఎందుకు నిషేధించిందంటే?
X

దిశ, ఫీచర్స్: సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా‌కు చెందిన 59,247 ఖాతాలను నిషేధించినట్లు క్రాఫ్టన్ ప్రకటించింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాటిల్ రాయల్ మొబైల్ గేమ్‌లలో ఒకటిగా ఉంది. క్రాఫ్టన్ ఆ అకౌంట్స్‌ను ఎందుకు నిషేధించిందంటే?

‘హ్యాకర్లు’ లాబీల్లోకి ప్రవేశించి, ఆటగాళ్లను చంపేందుకు చట్టవిరుద్ధమైన మార్గాలను ఉపయోగిస్తున్నారని వినియోగదారులు నివేదించారు. దీంతో సమస్యను పరిష్కరించడానికి కంపెనీ 59,247 ఖాతాలను బ్లాక్ చేసినట్లు తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా బీజీఎమ్‌ఐ సరికొత్త 1.6 వెర్షన్ అప్‌డేట్ తీసుకొచ్చినట్లు క్రాఫ్టన్ ఇటీవల తెలిపింది. రెండు ప్లాట్‌ఫారమ్‌ల యూజర్స్ కోసం గూగుల్ ప్లే స్టోర్, iOS యాప్ స్టోర్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. ఈ అప్‌డేట్ సీక్వెన్షియల్ పద్ధతిలో విడుదల అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇది వివిధ కొత్త మోడ్స్‌ను అందిస్తుండటంతో పాటు గేమ్‌లో మార్పులను తెస్తుంది. అప్‌డేట్ అందుకున్న ప్లేయర్స్‌కు కొత్త ‘ఫ్లోరా మెనాస్’ మోడ్ అందుబాటులో ఉండగా, ఇందులో గ్రహాంతర జీవులు ఆక్రమించిన మ్యాప్‌లో కొంత భాగంలో జీవిత అవరోధాన్ని సృష్టిస్తుంది. త్వరలో సంహోక్, లివిక్‌తో సహా ఇతర మ్యాప్‌లకు జోడించబడుతుంది. ఈ నెల చివరలో ప్రముఖ జోంబీ మోడ్ ‘సర్వైవ్ టిల్ డాన్’ సహా గేమ్ రికార్డింగ్ ఫీచర్‌ కూడా రిలీజ్ అవుతుంది. ఇది వినియోగదారులు వారి గేమ్‌ప్లేను రికార్డ్ చేయడానికి, ఆన్‌లైన్‌లో షేర్ చేయడానికి అనుమతిస్తుంది.

‘ప్రియమైన బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అభిమానులారా, మేము మా భద్రతా వ్యవస్థ, కమ్యూనిటీ మానిటరింగ్ ద్వారా కేసులను సేకరించి దర్యాప్తు చేశాం. అక్రమ వినియోగాన్ని నిర్మూలించడమే అంతిమ లక్ష్యంగా, బలమైన ఆంక్షలను అమలు చేయడానికి BGMI ప్రయత్నిస్తుంది. మీకు ఆహ్లాదకరమైన గేమింగ్ వాతావరణాన్ని అందించే కార్యక్రమాల కోసం మేం నిరంతరం కృషి చేస్తాం.
– క్రాఫ్టన్ యాజమాన్యం

Advertisement

Next Story