- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రిప్టోకరెన్సీ నిషేధం కంటే నియంత్రణ అవసరం: బీఏసీసీ!
దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టోకరెన్సీలను పూర్తిగా నిషేధించడం వల్ల చట్టవిరుద్ద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని, ముప్పు మరింత పెరుగుతుందని పరిశ్రమల సంఘం బ్లాక్‌చైన్, క్రిప్టో అసెట్స్ కౌన్సిల్(బీఏసీసీ) గురువారం వెల్లడించింది. ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ)లో భాగమైన బీఏసీసీ క్రిప్టోల ను కేవలం ఆస్తిగా మాత్రమే వినియోగించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి సూచించింది.
ఇటీవల ప్రధాని మోదీ క్రిప్టోకరెన్సీల లావాదేవీలు, కార్యకలాపాలపై ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని, యువతకు ప్రమాదమని, తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నామని బీఏసీసీ తెలిపింది. క్రిప్టో నిషేధిస్తే ప్రతికూల పరిణామాలు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.
నిషేధించడం వల్ల వాటి పునాదులను గుర్తించడం కష్టమవుతుందని, జవాబుదారీతనం వహించే వారుండరని, దీనివల్ల పన్ను ఎగవేతకు పాల్పడే వారు పెరుగుతారని ఏఐఎంఏఐ అభిప్రాయపడింది. రిటైల్ మదుపర్ల పై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొంది. క్రిప్టో ఆస్తులపై నియంత్రణ అమలు చేయడం వల్ల మదుపర్లకు భద్రత ఉంటుందని, దీనివల్ల క్రిప్టోకరెన్సీ ని కొనేవారు, విక్రయించేవారు నియంత్రణ పరిధిలోకి వస్తారని తెలిపింది. అప్పుడు పన్ను విధించేందుకు, చట్ట విరుద్ధ క్రిప్టోకరెన్సీ వినియోగానికి అవకాశం ఉండదని వెల్లడించింది.