టొబాకో బ్యాగ్స్ పట్టివేత..

by Aamani |   ( Updated:2020-09-09 21:44:07.0  )
టొబాకో బ్యాగ్స్ పట్టివేత..
X

దిశ, నిర్మల్: నిషేధిత టొబాకో బ్యాగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం సిరిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రాంనర్సింహరెడ్డి కథనం ప్రకారం..నిషేధిత తోట తంబాకు సంచులను బొలెరో వాహనంలో ఆదిలాబాద్ నుంచి సారంగాపూర్ మండలం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని సమాచారం వచ్చింది.

దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రమేష్ బాబు టీంతో సహా స్థానిక పోలీసులు సంయుక్తంగా సిరిపల్లి చెక్ పోస్టు వద్ద వాహనాన్ని పట్టుకున్నారు. పట్టుబడిన తంబాకు విలువ రూ. 2,19,120 ఉంటుందన్నారు.అనంతరం బొలెరోను సీజ్ చేసి అందులోని టొబాకో సంచులను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ రాం నర్సింహరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read Also…

లంచం@ రెవెన్యూశాఖలో రికార్డులు బ్రేక్..!

Advertisement

Next Story

Most Viewed