- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుండి మధ్యాహ్నం వరకే బ్యాంకులు.. ఎప్పటివరకో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలను మహమ్మారి పట్టి పీడిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువవడంతో ప్రభుత్వం నైట్ కర్ప్యూ పెట్టిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే అన్ని రంగాలలోని పని వేళలను కుదించారు. ఇప్పటికే రైలు, బస్సు వేళలను కూడా మార్చారు. ఇక తాజాగా బ్యాంకింగ్ రంగంలోనూ పనివేళలు కుదిస్తున్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకు మాత్రమే పనిచేస్తాయని తెలిపింది.
శుక్రవారం నుంచి (నేటినుంచి) మే 15వ తేదీ వరకు ఈ కుదించిన వేళలు అమలులోకి రానున్నట్లు తెలిపింది. బ్యాంకులో జరిగే లావాదేవీలన్నీ అలాగే కొనసాగుతాయని, కానీ అత్యవసర సేవలు అవసరమైతే తప్ప బ్యాంకుకి రావద్దని కూడా తెలిపింది. కరోనా కట్టడి చర్యలో భాగంగా ప్రతి ఒక్క బ్యాంక్ ఉద్యోగి కరోనా టీకా తీసుకోవాలని ఎస్‌ఎల్‌బీసీ కోరింది.