- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖాతాదారులకు మరో షాకిచ్చిన బ్యాంకులు.. ఇక జేబుకు చిల్లులే..!
దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకులు ఖాతాదారుల జేబుకు మరో చిల్లు పెట్టడానికి సన్నద్ధం అయ్యాయి. ఇప్పటికే డెబిట్, క్రెడిట్ కార్డుల సర్వీస్ ఛార్జీలు, బ్యాంక్, ఏటీఎం సర్వీస్ అంటూ ఏడాదికి వేల రూపాయలను గుంజుతున్నాయి. ఇది చాలదన్నట్లు ఏటీఎం సర్వీస్‌లపై మరో రూపాయిని పెంచుతూ ఖాతాదారులకు షాక్ ఇచ్చాయి. ఇక ఏటీఎం వెళ్లకుండా చేశాయి.
ఏటీఎం సర్వీస్ ఛార్జీలు పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పరిమితికి మించి ఏటీఎంను వినియోగిస్తే రూ.20 వసూలు చేస్తుండగా.. దానిని రూ.21లుగా పెంచుతూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులపై భారం పడనుంది. అయితే ఈ పెంచిన ధరలు జనవరి 1, 2022 నుంచి అమలులోకి రానుంది.
ప్రస్తుతం ఏటీఎం విత్ డ్రాపై బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. కస్టమర్‌లు తమ సొంత బ్యాంకు ATM నుంచి ప్రతి నెలా కొన్ని ఉచిత విత్ డ్రాలకు ఎలాంటి ఛార్జ్ ఉండదు. మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకు ATM నుంచి మూడు, నాన్-మెట్రో కేంద్రాల్లో ఐదు ఉచిత లావాదేవీలను ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఈ పరిమితి పెరిగితే ప్రతి విత్ డ్రాకు ఇకపై రూ.21 వసూలు చేయనున్నారు. అధిక ఇంటర్‌చేంజ్ ఫీజు, ఖర్చుల పెరుగుదల, బ్యాంకులు/వైట్ లేబుల్ ఆపరేటర్లు ఏటీఎం నిర్వహణ, విస్తరణ ఖర్చుల వ్యయం పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.