శుభవార్త చెప్పిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

by Harish |
Bank-of-India1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదివారం తన గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. గృహ రుణాలపై 35 బేసిస్ పాయింట్లు(0.35 శాతం), వాహన రుణాలపై 50 బేసిస్ పాయింట్లు(0.50 శాతం) తగ్గించినట్టు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. తగ్గించిన వడ్డీ రేట్లతో గృహ రుణాలు ఇకపై 6.50 శాతం నుంచి మొదలవనున్నాయి. ఇదివరకు ఈ రుణాలపై వడ్డీ రేటు 6.85 శాతంగా ఉండేది. వాహన రుణాలు ఇదివరకు 7.35 శాతంగా ఉండగా, ఇప్పుడు తగ్గించిన రేట్లతో 6.85 శాతం నుంచి ప్రారంభమవుతాయని బ్యాంకు వివరించింది. ప్రత్యేక ఆఫర్‌గా అందిస్తున్న ఈ తగ్గింపు ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంకు తెలిపింది. కొత్తగా రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వినియోగదారులకు, రుణాలను బదిలీ చేసుకునే వారికి కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అదేవిధంగా, ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గృహ, వాహన రుణాలకు ప్రాసెసింగ్ ఫీజును కూడా మినహాయింపు ఇచ్చామని బ్యాంకు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed