బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు.. 'మా' మోసం చేసింది.. అందుకే బరిలో దిగుతున్నా

by Anukaran |   ( Updated:2021-09-05 03:43:18.0  )
బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు.. మా మోసం చేసింది.. అందుకే బరిలో దిగుతున్నా
X

దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠను రేపుతోన్నాయి. ఈ ఎన్నికలు జరగడం ఏమో కానీ రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు మా సభ్యులు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవితా రాజశేఖర్ లాంటి వారు మా తరుపున పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.. అందులో కొంతమంది వైదొలిగారు. ఇక ఇకనైనా ఈ ఎన్నికలు ఎటువంటి వివాదాలు లేకుండా జరుగుతాయి అనుకొనేలోపు వివాదాల నిర్మాత బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేసి ఒక్కసారిగా ఇండస్ట్రీలో కలకలం రేపాడు.

ఇప్పటివరకు ప్రకాష్ రాజ్ కి మద్దతుగా, ఆయన ప్యానెల్ లో ఉన్న బండ్ల ఒక్కసారిగా ఆయన ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతే కాకుండా ‘మా’ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నానని ప్రకటించి అందర్నీ షాక్ కి గురిచేశాడు. తాజాగా ఆయన ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. “గౌరవనీయులైన ప్రకాశ్‌రాజ్‌ గారు, మీ ప్యానల్‌కు అధికార ప్రతినిధిగా నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. నా వ్యక్తిగత కారణాల వల్ల ఆ పదవికి సంతృప్తికరంగా న్యాయం చేయలేకపోతున్నాను. దయచేసి ఆ పదవికి వేరే వారిని నియమించగలరు. మీ టీమ్‌ మొత్తానికి ఆల్‌ ది బెస్ట్‌’ అని ట్వీట్ చేసిన కొద్దిసేపటికే.. “మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు- నన్ను పోటీ చెయ్ అంటోంది- అందుకే ఈ పోటీ.. అందరికీ అవకాశం ఇచ్చారు ఒకే ఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా” అంటూ చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా తాను పదవిలోకి వస్తే ఏం చేస్తానో కూడా చెప్పుకొచ్చాడు.” నా పరిపాలన ఎంటో తెలియచేస్తా వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం దానికోసం పోరాడతా.. వారి సొంత ఇంటి కల నిజం చేస్తా ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు.. ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు” అంటూ హామీలు కూడా ఇచ్చేశాడు. మా లో గొడవలు వలనే బయటికి వచ్చేసానని చెప్పిన బండ్ల “గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు.. ఇక అలా జరగొద్దు అందరి ఆశీస్సులు కావాలి మా ను బలో పేతం చేద్దాం ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ల కల నిజం చేద్దాం అదే మా నిజమైన అభివృద్ది.. చిహ్నం” అని తెలిపాడు. ప్రస్తుతం బండ్లన్న వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతోన్నాయి. మరి బండ్లన్న నిర్ణయంపై ప్రకాష్ రాజ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed