బండి సంజయ్ కీలక ప్రకటన.. వారి కోసం కొట్లాడుతా..!

by Shyam |
బండి సంజయ్ కీలక ప్రకటన.. వారి కోసం కొట్లాడుతా..!
X

దిశ, మహబూబాబాద్ : గిరిజనులపై టీఆర్ఎస్ సర్కార్ వివక్ష చూపుతున్నదని, వారికి జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ ఎందుకు కల్పించడం లేదని, దాని కోసం తాను కొట్లాడుతానని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్‌కు ఎంఐఎం పార్టీ మీద ఉన్న ప్రేమ ఎస్టీలపై లేదని విమర్శించారు. శుక్రవారం జిల్లాలోని గూడూరు మండలం మచ్చర్ల గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గిరిజన రిజర్వేషన్ సాధన కోసం పోరాటం చేయడానికి రాష్ట్ర బీజేపీ సిద్ధంగా ఉందని, వారిపై ఏ మాత్రం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉన్నా తమతో కలిసి రావాలని హితవు పలికారు. ఎంఐఏం పార్టీకి కేసీఆర్ బయపడి గిరిజనులకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ డబ్బుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుచేందుకు ప్రణాళికలు చేస్తున్నదని, అలాంటి ప్రలోభాలకు మేధావులు తలొగ్గరని తెలిపారు. రెండు స్థానాల్లోనూ బీజేపీదే గెలుపని ఇప్పటికే పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్, రాంచందర్ రావు, ప్రేమేందర్‌రెడ్డి, సంగప్ప పాల్గొన్నారు

Advertisement

Next Story