- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ తరలింపు గ్రేట్ : బండి
దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు తగ్గిన వేళ కొవిడ్బాధితులకు అవసరమైన ప్రాణ వాయువును అందించేందుకు యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్ల సరఫరాకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చొరవ చూపడం గొప్ప విషయమన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్సిలిండర్ల తరలింపుపై నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోడీ, డిఫెన్స్మినిస్టర్రాజ్నాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో సునామీ లాగా విస్తరిస్తున్న సెకండ్ వేవ్కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర సర్కార్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు.
రైల్వే, ఉపరితల రవాణా, పౌర విమానయాన, రక్షణ శాఖల సమన్వయంతో దేశంలోని అన్ని ప్రాంతాలకు అవసరాల రీత్యా త్వరితగతిన ఆక్సిజన్ అందేలా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. కేంద్రం తీసుకున్న ఈ చర్యలు మెచ్చుకోవాల్సింది పోయిన రాష్ట్ర సర్కార్కేంద్రంపై దుమ్మెత్తిపోయడం దారుణమన్నారు. తెలంగాణ సర్కార్వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని మండిపడ్డారు.