మీటర్లు పెట్టేది టీఆర్ఎస్ పార్టీకే !

by Shyam |
మీటర్లు పెట్టేది టీఆర్ఎస్ పార్టీకే !
X

దిశ, దుబ్బాక: ఏదేమైనా దుబ్బాకలో కాషాయ జెండా ఎగురుతుంది. మీటర్లు పెట్టేది మోటార్లకు కాదు టీఆర్ఎస్‌కు అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో రఘునందన్‌రావుకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సిద్దిపేట సీపీ ప్రవర్తన చూస్తే అమరులైన పోలీసుల ఆత్మ శాంతించదన్నారు. ఎంతోమంది యువత పోలీస్ కావాలని అనుకున్నవారు కూడా సిద్దిపేట సీపీని చూసి వద్దనుకున్నారని తెలిపారు. మంత్రి హరీష్‌రావును జోకడం యావత్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే మచ్చ తెచ్చిందన్నారు. బాయికాడ మీటర్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్తామన్నారు. కేసీఆర్ దొడ్డు వడ్లు పండించి.. రైతులు సన్నం వడ్లు పండించుమనడం సరైంది కాదన్నారు. రఘునందన్ మాట్లాడుతూ దేశంలో రామరాజ్యం నడిస్తే.. తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తుందన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత హరీశ్‌రావు తనంతట తానే షూట్ చేసుకునే పరిస్థితి వస్తదని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed