- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR : సీఎం కేసీఆర్ అమాయకుడు.. ఆయనకు ఏమీ తెలియదు: బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ చేతగానితనంతోనే జూడాలు నిరసన చేపట్టారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా కష్టకాలంలో ఆస్పత్రుల్లో సిబ్బంది తక్కువ ఉన్నారని తెలిసినా.. ఎందుకు స్టాఫ్‌ను పెంచలేదని ప్రశ్నించారు. అరకొరగా ఉన్న సిబ్బంది మీద ఒత్తిడి తీసుకొస్తున్నారే తప్పా.. కొత్త సిబ్బందిని తీసుకోవడం లేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం మీద నమ్మకం లేకనే జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారని.. చెప్పిన ఒక్క మాట కూడా నెరవేర్చకుండా విశ్వాసఘాతకుడిగా ముద్ర వేసుకున్నారని బండి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూడాలు 10 రోజుల క్రితమే సమ్మెకు దిగుతామని నోటీసులు ఇచ్చినప్పటికీ.. దాని గురించి పట్టించుకోలేదన్నారు. కానీ, ఇప్పుడేమో ఏమీ తెలియని అమాయకుడి లాగా నటిస్తూ.. ఉన్నతాధికారుల సమీక్షలో నిర్ణయం తీసుకోవడం ఏంటని నిలదీశారు. చేసే పనులు అన్నీ చేస్తూనే అమాయకుడిలా కేసీఆర్ నటిస్తున్నారని.. ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.